Sleep: మన శరీరంలో నిరోధక శక్తి బాగుండడానికి సరైన నిద్ర అవసరం. ఇప్పడున్న యాంత్రిక జీవనంతో చాలా మంది నిద్రకు కరువవుతున్నారు. డబ్బు సంపాదన మోజులో పడి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. 24 గంటల సమయంలో 18 గంటల వరకు పనులు చేయడంతో మిగతా సమయంలోనూ సరిగా నిద్రించడం లేదు. దీంతో అనేక వ్యాధులు వెంటాడుతున్నాయి. నిద్రలేమి వల్ల కంటి చుట్టూ వలయంలా ఏర్పడుతుంది. అంటే కంటికి సరైన రక్త ప్రసరణ లేదని అర్థం. ఇలా జరిగితే కంటి సమస్యలే కాకుండా ఇతర అనారోగ్యాలకు కారణమవుతారు. దీంతో చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తారు.
మనుషులకే కాకుండా ప్రతి ఒక్కరికి సరైన నిద్ర అవసరం. అయితే ప్రతి మనిషి ఎన్ని గంటలు నిద్రపోవాలి..? అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు జరిపారు. అయితే 8 గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. రోజంతా ఎంత కష్టం చేసినా అవసరైనమ నిద్ర పోతేనే శరీరానికి హాయిగా ఉంటుంది. బాడీకీ సరైన విశ్రాంతి లేనప్పుడు రోగనిరోధక శక్తి కరువవుతుంది. అందువల్ల దైనందిక జీవితంలో నిద్ర చాలా అవసరం. కొన్ని దేశాల్లో నిద్ర చాలా అవసరమని అందుకు సరైన సమయం ఇవ్వాలని ఉద్యోగులు పనిగంటల కోసం ఆందోళన నిర్వహించారు.
నిద్రలేమి కారణంగా చిన్న వయసులో ఉన్నవారు కూడా వయసుపైబడిన వారిలా కనిపిస్తారని పరిశోధనల్లో తేలింది. కంటినిండా నిద్రపోతే యాంటి ఏజెనింగ్ లక్షణాలను తగ్గించడంలో సహకరిస్తుంది. ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ కనీసం 8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎన్ని పనులున్నా.. నిద్ర కోసం అవసరమైన సమయాన్ని కేటాయించాలని సూచిస్తున్నారు. ఇక నిద్రపోవడం ఎంతముఖ్యమో.. నిద్రించేటప్పుడు ఎలా పడుకోవాలో అనేది కూడా ఇంపార్టెంటే. నిద్రించేటప్పుడు తల, మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలని సూచిస్తున్నారు.
నిద్రలేమి వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఎవరైనా కంటి చుట్టూ వలయంలా ఏర్పడితే అతనికి నిద్రల లేదని అర్థం. ఇలా నిద్ర కరువైన వాళ్లు కళ్లు సాగినట్లుగా కనిపిస్తాయి. సరిగా నిద్రపోతే కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి. ఇలా నిద్ర విషయాన్ని పట్టించుకోకపోవడంతో అజర్తి, నరాల బలహీనత, మధుమేహం, మలబద్ధకం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల నిద్ర విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగినంత నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.