Darck Circles: కళ్లకింద వయాలా..? ఇలా చేయండి..: ఈజీగా నయం అవుతాయి..

Darck Circles: మన శరీరంలో ఉండే ప్రధాన అవయవాల్లో కళ్లు ప్రధానమైనవి. కళ్లు లేకపోతే జీవితం చీకటిగా మారుతుంది. అందువల్ల కళ్లను జాగ్రత్తగా కాపాడుకుకోవాలి. కానీ ఇప్పుడున్న వాతావరణంతో కళ్లల్లో దుమ్ము, ధూళి పడి కళ్లు పాడవుతున్నాయి. అంతేకాకుండా సరైన నిద్ర పోకపోవడంతోనూ కళ్లకు ఎఫెక్ట్ పడుతోంది. నిద్రలేమితో బాధపడేవారిలో కళ్ల కింద వలయాలు ఏర్పడుతాయి. ఇలా ఏర్పడిన వారు నీరసంగా.. చూడ్డానికే వికారంగా కనిపిస్తారు. మరికొందరికి కళ్లకింద ఐ బ్యాగ్స్ ఏర్పడుతాయి. అయితే ఇవి పోవాలంటే ఏం చేయాలో చాలా మందికి తోచదు. కానీ వాటిని కొన్ని చిట్కాలు పాటించి తొలగించుకోవచ్చు..

మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. పెద్దవారు కనీసం రోజుకు 8 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. ఇలా తాగడం వల్ల మన శరీరంలో ఉండే ఆహారం త్వరగా జీర్ణమై రక్త ప్రసరణ సరిగ్గా సాగుతుంది. దీంతో ఈ రక్త ప్రసరణ కళ్లకు కూడా సరిగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా నీటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనసులో ఉత్సాహాన్ని నింపేందుకు అప్పుడప్పుడు టీ తాగుతూ ఉంటాం. అయితే టీ బ్యాగులను వేడి నీటిలో కాసేపు ఉంచాలి. ఆ తరువాత ఒక్కో టీ బ్యాగ్ ను ఒక్కో కంటిపై 15 నిమిషాల పాటు ఉంచాలి.

ఇవే కాకుండా గుడ్డులోని తెల్లసోనను ఉపయోగించి కూడా ఉబ్బిన కళ్లను నయం చేసుకోవచ్చు. గుడ్డులో చర్మాన్ని రక్షించే గుణాలుంటాయి. గుడ్డులోని తెల్లసోనను గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత బాగా కలిపి మెత్తడి బ్రష్ తో కళ్ల చుట్టూ రాయాలి. ఈ మిశ్రమం పొడిబారే వరకు అలాగే ఉంచాలి. ఇలా 20 నిమిషాలపాటు ఉంచడం వల్ల సరైన ఫలితంఉంటుంది. వీటితో పాటు కీర దోశను కూడా కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కీరదోశను గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకొని కళ్లపై ఉంచుకోవాలి. దీంతో కళ్ల కింద ఉన్న ముడతలు పోతాయి.

ఇక కలబంధను ఉపయోగించి కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కలబందను గుజ్జులాగా తయారు చేసి ఆ గుజ్జును కళ్ల చుట్టూ రాయాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రాయడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు తొలిగిపోతాయి. కంటికి రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడంతోనే ఈ సమస్యలు వస్తాయి. ఈ నేపథ్యంలో రక్తప్రసరణ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *