Coriander Leaves Tea: కూరల్లో మంచి సువాసన రావాలంటే కొత్తిమీరను వేస్తుంటాం. కొన్ని కూరలను కొత్తిమీర లేకుండా చూడలేం. ఇది వేయడం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది. కొత్తిమీరను వేయడం వల్ల రుచితో పాటు జీర్ణశక్తికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకుల్లో సుగంధ తత్వాలతో పాటు ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అందువల్ల ప్రతీ కూరలో కొత్తిమీర వేసేందుకు ప్రయత్నిస్తుంటాం. అయితే కూరల్లోనే కాకుండా కొత్తిమీరను నేరుగా కూడా వినియోగించవచ్చు. కొత్తిమీర టీని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కొత్తిమీరను వాడాలని తాజా అధ్యయనాల్లో తేలింది. మరి కొత్తి మీర టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

కొత్తిమీరలో డ్యుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే బ్యాక్టీరియాలను చంపేస్తుంది. సాధారణంగా ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు జెన్ టామైసిన్ వాడుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు కొత్తిమీర టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇవే కాకుండా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, శరీరంలో ఉన్న వేడికి తగ్గించడంలో కొత్తిమీర సహకరిస్తుంది. లైంగిక సామర్థ్యం పెరగానికి కూడా కొత్తిమీర సహకరిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం కాదు.
వేడినీటిలో కొత్తిమీర వేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఒక గిన్నెలో ఓ గ్లాసు నీటిని తీసుకొని వేడి చేయాలి. అంతకుముందే కొత్తిమీరను శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వేడవుతున్న నీటిలో కొత్తమీరను వేయాలి. ఇలా వేసిన తరువాత 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తరువాత ఈ నీటిని కాచి వడబోసి ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పడే తాగితే రుచిగా ఉంటుంది.
ఇలా ప్రతిరోజూ పరగడుపున కొన్ని రోజుల పాటు తీసుకోడంతో మూత్రపిండాల్లో ఉన్న రాల్ల సమస్య తగ్గుతుంది. శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొత్తిమీరలో డ్యుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే బ్యాక్టీరియాలను చంపేస్తుంది. సాధారణంగా ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ అయినప్పుడు జెన్ టామైసిన్ వాడుతూ ఉంటారు. కానీ అంతకంటే ముందు కొత్తిమీర టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇవే కాకుండా గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, శరీరంలో ఉన్న వేడికి తగ్గించడంలో కొత్తిమీర సహకరిస్తుంది. లైంగిక సామర్థ్యం పెరగానికి కూడా కొత్తిమీర సహకరిస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం కాదు.
కొత్తిమీర టీ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఇందులో కొంచెం చెక్కర వేసుకొని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. అందువల్ల ప్రతిరోజూ కొత్తిమీర టీని తీసుకునేందుకు ప్రయత్నించి ఆరోగ్యంగా జీవించడి..