News Telugu

Coconut Rise: కొబ్బరి రైస్ ఎలా తయారు చేయాలో తెలుసా..?

Coconut Rise: మనకు ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. పూజలు, వ్రతాలు జరిగినప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. అయితే వీటిని నేరుగా బెల్లం కలిపి కూడా తినొచ్చు. కొట్టిన కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటే కొబ్బరి పచ్చడి చేసుకుంటారు. కానీ పచ్చి కొబ్బరిని కలిపి రైస్ కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి రైస్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో ఆరోగ్యకరం. అయితే కొబ్బరి రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కొబ్బరి రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

ఇలా తయారు చేసుకోండి..:

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత కుక్కర్లో వేసి అందులో పాలు, ఉప్పు, నూనె వేసి ఉడకించాలి. ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ తరువాత అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుళాయి తీసుకోవాలి. అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తరువాత మిరియాలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత ఇంగువ, పచ్చికొబ్బరి తరుము వేసి 2 నిమిషాలు కలుపుతూ వేయించాలి. ఆ తరువాత వేడి వేడిగా కొబ్బరి రైస్ రెడీ అవుతుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కూడా జరుతుంది.

Exit mobile version