మనం తినే ఆహారంలో నిమ్మకాయను కూడా ఉపయోగిస్తాం. దీనిని కూరల్లో వండకపోయినా నిమ్మను ఉపయోగించి ఇతర పదార్థాలను చేసుకుంటారు. వేసవి కాలంలో నిమ్మకాయ శర్బత్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ చట్నీ, నిమ్మకాయ పులిహోర వంటివి చేసుకుంటాం. అయితే కొన్ని వ్యాధుల బారిన పడిన వారు నిమ్మకాయను ఇంకో విధంగా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి నిమ్మకాయలను ఏ విధంగా ఉపయోగించాలి..? అసలేం చేయాలి..?

శరీరంలో ఉన్న మలినాలను శుభ్రం చేయడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వేడి చేసిన నీటిలో నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల ఉదర సమస్యలు ఉండవు. నిమ్మలో మినరల్స్, న్యూటియన్స్ అధికంగా ఉంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. వేడి చేసిన నీటిలో నిమ్మరసంతో పాటు తేనె, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి తింటే అధిక ప్రయోజనాలు ఉంటాయి.
అయితే ఇలాంటివి చూసే ఉంటారు. కానీ నిమ్మకాయలను ఉడికించిన పానీయం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. ఒక గిన్నెలో నీరు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక నిమ్మకాయ ముక్కలను, అల్లం ముక్కలను, దంచిన వెల్లెల్లి రెబ్బలను వేయాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక గ్లాసులో తీసుకోవలి. ఈ పానీయం చల్లగా అయిన తరువాత ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగాలి. దీనిని ఉదయం పరిగడుపున తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతుంది. నిమ్మలో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. దీంతో ఇది అనేక ఆరోగ్య సమస్యలకు యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. ఈ పానియం తాగడం వల్ల కాలేయం కూడా శుభ్రంగా మారుతుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.