ప్రకృతిలో మనకు లభించే చాలా మొక్కలను మనం పట్టించుకోం. కానీ అవి చేసే మేలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం. మనం రోడ్డుమీద వెళ్తున్నప్పుడ కనిపించే ఈ మొక్కలు ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయంటే ఎవరూ నమ్మరు. కానీ కొందరు ఆయుర్వేద శాస్త్రేవేత్తలు దీనిని నిరూపించారు. అలాంటి మొక్కలో మనం చెప్పుకోవాల్సి తెల్ల గల్జేరు. దీనినే పునర్నవా అని అంటారు. ఈ ఆకును పొడిగా చేసుకొని తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్, లుకేమియా లాంటి వ్యాధులురాకుండా కాపాడుతుంది. అలాగే షుగర్ లెవల్ కంట్రోల్ చేయడానికీ ఉపకరిస్తుంది. ఈ విషయాన్ని 2014లో నేచురల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఫార్మసిటికల్ రీసెర్చ్ పంజ్ వారు నిరూపించారు. అయితే ఈ ఆకు తీసుకోవడం వల్ల మహిళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కూడా తోడ్పతుతుందని తాజా అధ్యయనాల ద్వారా వెల్లడైంది.

పునర్నవా ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీని డికాషన్ తాగడం వల్ల డ్యామేజ్ అయిన కిడ్నీలు కూడా నయం అయేలా తోడ్పడుతుంది. ఆ విషయాన్ని సైంటిఫిక్ గా కూడా నిరూపించారు. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తెల్లగల్జేరు తీసుకోవడం వల్ల మూడు నెలల్లోనే మంచి ఫలితం వచ్చిందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పునర్నవా క్రోసెటివ్, పునర్ నవీన్ అనే రెండు కెమికల్స్ కాంబినేషన్స్ ఉండడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.
దీనిని రకరకాలుగా ఆహారంగా తీసుకోవచ్చు. కూరగా కూడా వండుకోవచ్చు. పప్పుతో కలిపి వండుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పునర్నవి ఆకు గురించి తెలియడంతో మార్కెట్లో ఇటీవల విరివిగా వస్తోంది. పాలక్ టమాటాలాగా దీనిని వండి తినడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు. కేవలం కర్రీలాగానే కాకుండా డికాషన్ చేసుకొని కూడా తాగొచ్చని అంటున్నారు. అలా చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.
ఇక తెల్లగల్జేరు మహిళలకు ప్రత్యేక ఔషధంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. వారిలో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ను ఇది నివారిస్తుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే దీనిని డికాషన్ చేసుకొని తాగాలని సూచిస్తున్నారు. పునర్నవా ఆకుని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడబోసి అందులో నిమ్మరసం కలిపి తాగొచ్చని అంటున్నారు. ఇలా సాధ్యం కాకపోతే పునర్నవి ఆకును పొడిగా చేసి దానిని నీళ్లలో వేసి మరిగించి ఆ తరువాత వడబోసుకొని తాగాలంటున్నారు. ఎలా వీలైతే అలా ఈ ఆకును మన శరీరంలోకి పంపించడం వల్ల అనేక వ్యాధులను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.