ఇప్పుడున్నచాలా మందిలో షుగర్ వ్యాధితో బాధపడేవారే ఎక్కువగా ఉన్నారు. రక్తంలో దీని శాతం ఎక్కువైనప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందువల్ల షుగర్ లెవల్స్ తగ్గించుకోడానికి కొందరు ఇన్సులిన్ తీసుకుంటారు. అయితే అంతకంటే ముందు కొన్ని ఆరోగ్య చిట్కాలుపాటిస్తే కూడా ఇన్సులిన్ అవసరం లేకుండా మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి పెద్దగా ప్రయాస పడకుండా ఇంట్లో దొరికే వస్తువులనే వాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మనం ఇంట్లోకి తెచ్చుకునే కూరగాయల్లోకాకరకాయ కూడా ఉంటుంది. కాకరకాలో కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. కాకరకాయను తరుచుగా తీసుకోవడంతో రక్తం శుద్ధి చేస్తుంది. హైబీపీ ఉన్నవాళ్లు కూడా కాకరకాయ తింటే నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక కాకరకాయలను కూరగానే కాకుండా జ్యూస్ గా, పొడిగా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇంట్లోని పోపుల పెట్టెలో మెంతులు తప్పనిసరిగా ఉంటాయి. కొందరు మెంతులు వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇవి చేసే మేలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు. మెంతుల రసాన్ని తాగడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేయాలి. దీనిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని పరిగడుపున ఈ రసాన్ని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెకస్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఇంట్లోనే ఉండే మరో పదార్థం దాల్చిన చెక్క. ఈ చెక్కతో టీని తయారు చేసుకొని తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. దాల్చిన చెక్కను పొడిగా చేసుకోవాలి. ఆ తరువత ఒక గిన్నెలో నీరు పోసి అందులో చెక్కను లేదా పొడిని వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇలా ఉదయం పరిగడపున తాగడం వల్ల షుగర్ అదుపులో ఉంటుందని అంటున్నారు. ఇవే కాకుండా తులసి ఆకుల రసాన్ని కూడా ప్రతిరోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని అంటున్నారు.