మానవ శరీరం అనేక అవయవాలతో కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కొన్ని నొప్పులు, రోగాలు పోవాలంటే సంబంధిత అవయవాలపై ప్రెషర్ కలిగిస్తే చాలని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ వీటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ కొందరు ప్రయోగం చేసిన తరువాత ఇది నిజమని నిరూపించారు. మన చేతికుంటే 5 వేళ్లను మసాజ్ చేయడం ద్వారా 10 రకాల రోగాలను దూరం చేయొచ్చని అంటున్నారు. మనం చేసే ప్రతీ పనిని చేతులతోనే చేస్తాం. ఒక్కో వేలు ఒక్కో అవయవంతో ముడిపడి సంబంధిత వాటిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ఏ వేలు ఎలాంటి అవయవానికి ముడిపడి ఉంటుంది…? ఏ రోగాన్ని మాయం చేయాలంటే ఏ వేలిని మర్దన చేయాలి..? అనేది తెలుసుకుందాం..
మన చేతివేళ్లలో బొటన వేలు ప్రధానమైంది. ఒక వస్తువులను గట్టిగా పట్టుకోవాలని బొటనవేలు ప్రధానంగా పనిచేస్తుంది. పిడికిలి బిగించాలన్నా బొటనవేలుతోనే సాధ్యమవుతుంది. ఈ బొటన వేలు గుండెకు సంబంధంగా పనిచేస్తుంది. బొటన వేలును రుద్దడం వల్ల గుండెకు మేలు చేస్తుందట. గుండె దడ, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు బొటన వేలును ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఇలా చేస్తే పలితం ఉంటుంది.

అలాగే చూపుడు వేలు పొట్టలోని పెద్ద పేగుతో అనుసంధానమై ఉంటుంది. దీనిని ఒక నిమిషం పాటు మర్దన చేయడం వల్ల మలబద్ధకం, డయేరియా సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. అలసట, నిద్రలేమి సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది. మధ్యవేలు వెనకభాగాన మర్దన చేయడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఉంగరం వేలు పొట్టలోని కండరాలతో అనుసంధానమై ఉంటుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
మైగ్రేన్, మెడ నొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు చివవరి వేలు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల తల నొప్పి వంటి సమస్యలున్న వారు ఇలా చేయొచ్చు. రక్త ప్రసరణ సరిగ్గా జరడానికి ఈ వేలు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా చేతి వేళ్లను మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఇంట్లోనే పొగోట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..